భారతదేశం, డిసెంబర్ 16 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 905వ ఎపిసోడ్ మొత్తం ఉత్కంఠగా సాగింది. రాజ్, కావ్యలకు రాహుల్ షాకివ్వడం, ఎమోషనల్ అయిపోయిన స్వప్న అతన్ని రాజ్ నుంచి రక్షించడం, అటు అప్పు విషయంలో కల్యాణ్ ను తండ్రి ప్రకాశం ఆదుకోవడం ఈ ఎపిసోడ్ లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (డిసెంబర్ 16) ఎపిసోడ్ అంజలి కేసు విషయంలో సీఐని అప్పు కన్విన్స్ చేసే సీన్ తో మొదలవుతుంది. తప్పిపోయిన అంజలికి సంబంధించిన రిపోర్టులు రావడంతో ఏడాది కిందటి పోస్టుమార్టమ్ రిపోర్టులకు, అంజలికి ఎలాంటి సంబంధం లేదని తేలుతుంది. దానినే సీఐకి చూపించి ఆ పాప బతికే ఉందని, ఆమెను తీసుకొస్తానని చెప్పడంతో సీఐ ఆమెను అభినందించి కేసు కొనసాగించమని అంటాడు.

ఇటు రాహుల్ కు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు కోసం రాజ్, కావ్య, స్వప్న కూడా వెళ్తారు. రాహుల్ ను పొగుడుతూ ఆ...