భారతదేశం, డిసెంబర్ 15 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కళావతి సమస్య పూర్తిగా తీరిపోయిందని రాజ్ చెబుతాడు. ఇంట్లో అంతా సంతోషిస్తారు. నెల రోజులు గురువు గారు చెప్పిన మందులు వాడితే కళావతి సంతోషంగా బిడ్డను కంటుందని చెప్పారని రాజ్ అంటాడు. రుద్రాణి నమ్మదు. దాంతో రిపోర్ట్స్ చూపిస్తాడు రాజ్. ఇక కళావతి ధైర్యంగా ఇంటి వారసుడిని ఇస్తుందని రాజ్ అంటాడు.

రాజ్ నీ బాధ్యతలను చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నావని సీతారామయ్య మెచ్చుకుంటాడు. ఇంతలో రాజ్‌కు రమాకాంత్ కాల్ చేసి ఈవెనింగ్ అవార్డ్ ఫంక్షన్ గురించి చెబుతాడు. ఏం ఫంక్షన్ అని రాజ్ అంటే.. మీ ఫంక్షన్ గురించి మీకు తెలియదా.. నైట్ పదికి వచ్చేయండి అని రమాకాంత్ కాల్ కట్ చేస్తాడు. కాల్ గురించి సుభాష్‌ను రాజ్ అడిగితే రాహుల్ కంపెనీ తక్కువ టైమ్‌లో ఎక్కువ మార్కెటింగ్ చేసిన కంపెనీగా గుర్తించబడిందని స్వప్న అంటుంది....