భారతదేశం, డిసెంబర్ 12 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్ నుంచి రేణుక వెళ్తుంటే తన భర్త వస్తాడు. రేణుక భర్తతో మీ పాప బతికే ఉందని అప్పు చెబుతుంది. దాంతో రేణుక భర్త షాక్ అవుతాడు. మీరేంటీ షాక్ అవుతున్నారు. బతికే ఉందంటే ఒక చిన్న క్లూ దొరికింది. మీ ఆవిడ సూసైడ్ చేసుకుంటే మీరేంటీ తాపిగా వచ్చారు అని అప్పు అంటుంది.

దానికి మరింత కంగారుపడిపోతాడు రేణుక భర్త. పాప బాడీని రీ పోస్ట్‌మార్టమ్ చేయిస్తున్నామని, డీఎన్ఏ టెస్ట్‌లో కూడా ఎర్రర్ ఉండొచ్చని, అప్పుడు అన్ని నిజాలు బయటపడతాయని అప్పు అంటుంది. దానికి కంగారుపడిన రేణుక భర్త అశోక్ అలా అయితే మంచిదేగా, వెళ్లొస్తాను అని వెళ్లిపోతాడు. అశోక్ డౌట్‌గా వెళ్లిపోతాడు.

మరోవైపు ఎలాగైనా తప్పించుకోవాలని రాజ్, కావ్య అనుకుంటారు. రాజ్ వెనుక ఉన్న బీర్ సీసా తీసుకుని పగులగొట్టి తాళ్లు కోస్తాడు. ఇంతలో రౌడీల...