భారతదేశం, డిసెంబర్ 11 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నడుము అందాలతో రాహుల్‌ను రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకొస్తుంది స్వప్న. ఇవాళ పెళ్లి రోజు కూడా కాదే అని స్వప్నను హగ్ చేసుకుని చెబుతాడు రాహుల్. మొగుడి కోసం రెడీ అవ్వడానికి కూడా అకేషన్ ఉండాల అని స్వప్న అంటుంది.

ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. స్వప్నకు రాహుల్ ముద్దు పెట్టబోయి ఆగిపోతాడు. కాస్తా టెన్షన్‌గా ఉంది. డిజైన్స్ మ్యాన్యుఫాక్చర్ చేయించాం కానీ పబ్లిసిటీ చేయించాలి. రాజ్ లాగా కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రిటీలను పెట్టలేను. ఏదైనా ఐడియా చెప్పమని చెప్పిన రాహుల్ కాసేపటికి నువ్వే మోడల్‌లా జ్యూవెలరీ యాడ్ చేయొచ్చుగా. నీకు ఎలాగు మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందిగా అంటాడు.

ముందు వద్దని చెప్పిన స్వప్న తర్వాత ఒప్పుకుంటుంది. దాంతో రాహుల్ స్వప్నను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెబుతాడు. ఇక ఆ డిజైన్స్ నావ...