భారతదేశం, డిసెంబర్ 10 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 900వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఒకే ఎపిసోడ్ లో కథలో మూడు కీలకమైన మలుపులు చోటు చేసుకోవడం విశేషం. ఇటు రాహుల్ కు పూర్తిగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది స్వప్న. అటు అంజలి మిస్సింగ్ కేసును పరిష్కరించే క్లూను అప్పు సంపాదిస్తుంది. ఇటు కేరళలో రాజ్, కావ్య కిడ్నాపైనా తప్పించుకోవడానికి ప్రయత్నించి మరింత చిక్కుల్లో పడతారు.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (డిసెంబర్ 10) ఎపిసోడ్ అంజలి మిస్సింగ్ కేసు గురించి అప్పు బాధపడే సీన్ తో మొదలవుతుంది. సీఐ ఆ కేసును మూసేయమని చెప్పడంతో ఆమె చికాకు పడుతుంది. ఫైల్స్ ను నేలకేసి కొడుతుంది. అప్పుడే గదిలోకి వచ్చిన కల్యాణ్ ఆమెకు సర్దిచెబుతాడు.

ఇక కేసు వదిలేస్తానని చెప్పిన అప్పులో ధైర్యం నింపుతూ.. లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలో చెబుతాడు. అప్పుడే అప్పుకు సుందరి అనే మహిళ ఫ...