భారతదేశం, డిసెంబర్ 1 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో మేనేజర్ సతీష్ తన కంపెనీలోకి వచ్చాడని, అక్కడ రిజైన్ చేసినట్లు తర్వాత తెలిసిందని, పర్వాలేదా అని అడుగుతాడు రాహుల్. నీకు తెలిసిన తర్వాత అయిన రాజ్‌కు చెప్పాలిగా, నీకు తప్పనిపించలేదా సుభాష్, ప్రకాశం అంటారు.

రాహుల్‌కు ఎక్స్‌పీరియెన్స్ తక్కువ, ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఉన్నవాళ్లను తీసుకుంటే మంచిదనిపించింది. నేను కొత్త వాళ్లను అపాయింట్ చేసుకుంటాను అని రాజ్ అంటాడు. అన్నింటిని తేలిక తీసుకోవడం వల్లే మనం పోటీలో వెనుకపడుతున్నాం అని చెబుతాడు సుభాష్.

మళ్లీ నెంబర్ వన్‌లో ఉండేందుకు అన్ని కొత్త డిజైన్స్ తయారు చేయిస్తున్నాం. న్యూ ఇయర్ లోపు వంద కొత్త డిజైన్స్ రిలీజ్ చేస్తాం అని కావ్య, రాజ్ చెబుతారు. ఆ మాటలు విన్న రాహుల్ ఇంత తక్కువ టైమ్‌లో ఎలా చేస్తారు. నిజంగా సాధ్యమవుతుందా అని అడుగుతాడు. వ్యాపారం అ...