Hyderabad, సెప్టెంబర్ 12 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ధాన్యలక్ష్మీ, రుద్రాణి అడగడంతో అపర్ణ గిఫ్ట్‌గా ఇచ్చిన పది లక్షల నెక్లెస్ పెట్టుకోడానికి గదిలోకి వెళ్తుంది. కానీ, అక్కడ నెక్లెస్ కనిపించదు. బయటకు వచ్చిన కావ్య నెక్లెస్ కనిపించడం లేదని చెబుతుది. అది విని అంతా షాక్ అవుతారు. అయ్యో పది లక్షల నెక్లెస్ పోయిందా అని డ్రామా చేస్తుంది రుద్రాణి.

ఇంట్లో ఉన్నవాళ్లకు ఆ నెక్లెస్ తీసే ఛాన్స్ లేదు. బయట వాళ్లు అంటే పని మనిషి ఉందని రత్తాలును పిలిచి అడుగుతుంది రుద్రాణి. నన్ను అనుమానిస్తే బాగుండదు. ధాన్యలక్ష్మీ గారు ఎన్నోసార్లు నగలు పడేసుకుంటే నేనే తీసుకొచ్చి ఇచ్చాను అని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది పని పనిషి రత్తాలు. ధాన్యలక్ష్మీ కూడా అవును అంటుంది.

ఇక బయటవాళ్లు అంటే రాధ ఒక్కరే ఉన్నారు. తనే తీసి ఉంటుంది. చూస్తుంటే ఆమె కష్టాల్లో ఉన్నట్లుంది అ...