Hyderabad, సెప్టెంబర్ 25 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డాక్టర్‌ను కలిసిన రాజ్ అబార్షన్ గురించి కావ్యకు చెప్పలేదని చెబుతాడు. సరే నేను చెప్పి, మెంటల్‌గా ప్రిపేర్ చేస్తానని డాక్టర్ అంటుంది. చెప్పడం వద్దు డాక్టర్. మీరు కూడా చెప్పకండి. తనకు ఇలాంటి సమస్య వచ్చిందని తెలిస్తే అబార్షన్‌కు ఒప్పుకోదు. తన బిడ్డను చంపుకోడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు అని రాజ్ అంటాడు.

ఎలాగైనా ఒప్పించి అయినా చేయాలి. చెప్పకుండా ఆపరేషన్ ఎలా చేస్తాం. తనకు చెప్పకుండా ఆపరేషన్ నేను చేయలేను. అది ఇల్లీగల్. అమ్మాయికి తెలియకుండా అబార్షన్ చేయడం చాలా పెద్ద నేరం. రేపు ఆవిడ నన్ను క్వశ్చన్ చేస్తే ఎలా చెప్పండి. రేపు ఆవిడ కోపంతో కోర్టుకు వెళ్తే నా ప్రాక్టీస్‌తోపాటు హాస్పిటల్ కూడా మూసుకోవాల్సి వస్తుంది. అంత పెద్ద రిస్క్ తీసుకోలేను అని డాక్టర్ అంటుంది.

ప్లీజ్ డాక్టర్ తనక...