భారతదేశం, జూన్ 17 -- స్వ‌ప్న క‌ళ్లు గ‌ప్పి కిటీకి గుండా కిందికి దిగిపారిపోతారు రాహుల్‌, రుద్రాణి. త‌న ఐడియా ఎలా ఉంద‌ని త‌ల్లితో అంటాడు రాహుల్‌. ఐడియా లేటుగా వ‌చ్చినందుకు కొడుకుకు క్లాస్ ఇస్తుంది రుద్రాణి. ఇద్ద‌రు క‌లిసి రాజ్‌, యామినిల నిశ్చితార్థానికి బ‌య‌లుదేరుతారు. వారు పారిపోవ‌డం స్వ‌ప్న చూస్తుంది. ఈ విష‌యం ఇందిరాదేవికి ఫోన్ చేసి చెబుతుంది.

రాజ్‌, యామినిల నిశ్చితార్థ ప‌నుల‌ను అప‌ర్ణ‌, ఇందిరాదేవి ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. వారికి యామిని త‌ల్లి వైదేహి థాంక్స్ చెబుతుంది. కొన్నిప‌నులు ఎవ‌రి చేతుల మీదుగా జ‌ర‌గాలో వాళ్లే చేస్తే బాగుంటుంద‌ని ఇందిరాదేవి అంటుంది. రాజ్ త‌ర‌ఫున యామిని త‌ల్లికి తాంబూలం ఇస్తుంది అప‌ర్ణ‌. మీ అత్త‌గారి చేతుల మీదుగానే తాంబూలాలు తీసుకుంటున్నాం అని కావ్య‌ను చూసి విజ‌య‌గ‌ర్వంతో పొంగిపోతుంది యామిని. పెళ్లికి ఇంకా చాలా టైమ్...