Hyderabad, సెప్టెంబర్ 4 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో వినాయక చవితిని గ్రాండ్‌గా చేసుకుందమామని చెబితే రుద్రాణి కౌంటర్స్ వేస్తుంది. దానికి కుక్కలు, జంతువులు తమకు నచ్చినట్లు చేసుకోవు. మనుషులకు మాత్రమే ఆ స్వభావం ఉంది అని కావ్య రివర్స్ కౌంటర్ ఇస్తుంది. దాంతో బాగా చెప్పావ్ అని ధాన్యం అంటే.. చెప్పడం కాదు బాగా గడ్డిపెట్టిందని ప్రకాశం అంటాడు.

పాపం రుద్రాణి మాత్రం అటు జంతువుగా కాకుండా ఇటు మనిషిగా పుట్టింది. ఏం చేస్తుంది అని ఇందిరాదేవి మరింత సెటైర్లు వేస్తుంది. ఇంతలో కనకం, కృష్ణమూర్తి ఇంటికి వస్తారు. వినాయక చవితి వస్తుందిగా.. కూతుళ్లు కడుపుతో ఉన్నారు. మొదటి పండుగను మా ఇంట్లో జరుపుకోవాలనుకుంటున్నాం. అల్లుళ్లను తీసుకెళ్తాం అని కనకం అంటుంది.

ఇందిరాదేవి సరే అంటుంది. కానీ, ధాన్యలక్ష్మీ ఒప్పుకోదు. మీరే మా ఇంటికి పండుగకు వచ్చేయొచ్చు కదా అని అప...