Hyderabad, సెప్టెంబర్ 8 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పంతులును పూజకు సిద్ధం చేయమని, తాము ప్రసాదం ప్రిపేర్ చేస్తామని కావ్య చెబుతుంది. కావ్యను పక్కకు పిలిచిన రాజ్.. అక్క రేవతికి కాల్ చేస్తాడు. ఇంటి బయటే ఉన్నానని రేవతి చెబుతుంది. రాజ్, కావ్య ఇద్దరు బయటకు వెళ్తారు. కళావతిని కాసేపు ఆడుకుందాం అని రాజ్ అనుకుంటాడు.

రేవతి గారు వచ్చారన్నారు. ఎక్కడ అని కావ్య అడుగుతుంది. నీకు అబద్ధం చెప్పాను. వచ్చింది అక్క కాదు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి వచ్చింది అని అక్క రేవతిని ఫ్రెండ్‌గా చూపిస్తాడు రాజ్. మొన్నటిదాక యామిని అయింది, ఇప్పుడు దాని చెల్లి వచ్చిందా అని కోపంగా వెళ్తుంది కావ్య. ముసుగు వేసుకున్న రేవతిని కావ్య చెడామడా తిడుతుంది.

ముసుగు వేసుకున్నావేంటీ అని తీసి చూసి షాక్ అవుతుంది కావ్య. సారీ వదినా అని కావ్య చెబుతుంది....