Hyderabad, జూలై 3 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాహుల్ స్వప్న రూమ్ లాకర్ తెరిచేందుకు వెతికితే స్వప్న వచ్చి దానికి కీ కావాలనంటుంది. ఈ సారి ఏం కొట్టేయాలని ప్లాన్ చేశావ్, ఏం దొంగతనం చేయాలనుకుంటున్నావ్ అని స్వప్న తిడుతుంది. నేను వచ్చింది కొట్టేయడానికి కాదు చార్జర్ కోసం అని పక్కన ఉన్న చార్జర్ తీసుకుని వెళ్లిపోతాడు రాహుల్.

నా దొంగమొగుడు మళ్లీ ఏదో కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నాడని స్వప్న అనుకుంటుంది. రాహుల్ మాత్రం హమ్మయ్య తప్పించుకున్నాను. లేకుంటే స్వప్న చేతిలో చచ్చుండేవాన్ని అని అనుకుంటాడు. మరోవైపు రాజ్, కావ్య ఏం మాట్లాడుకున్నారో తెలీదు. వీళ్లిద్దరికి త్వరగా మూడు ముళ్లు వేస్తే అయిపోతుందని అపర్ణ అంటుంది. ఇంతలో రాజ్ ఫుల్ జోష్‌తో వస్తాడు.

ఇందిరాదేవి పిలిచి నిన్న ఏం జరిగిందో చెప్పమని అడుగుతుంది. తినేసి పడుకున్నా. యామిని వండింది. అంతగా బ...