Hyderabad, జూలై 2 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్, కావ్య కారులో వెళ్తుంటారు. దారిలో రేవతి కొడుకుతో కనిపిస్తుంది. కొత్త షూస్ కొనివ్వమని రేవతిని కొడుకు అడుగుతాడు. ఇవాళ నా బర్త్ డే కదా. ఇవాళ నాకు ఆ షూస్ కావాల్సిందే అని పట్టుబడతాడు రేవతి కొడుకు. దాంతో షాప్ అతన్ని షూస్ ధర ఎంతని అడిగితే రూ. 2 వేలు అని చెబితే రేవతి దగ్గర అంత డబ్బు ఉండదు.

తర్వాత వస్తామని కొడుకుని తీసుకెళ్లి పోతుంది రేవతి. ఇప్పుడు అంత డబ్బు లేదు. వచ్చే సంవత్సరం కొనిస్తాను అని రేవతి అంటే.. నువ్ ఎప్పుడు ఇలాగే అంటావ్ కొనివ్వవు. ఇలాగే అబద్ధం చెబుతావ్ అని రేవతి కొడుకు అంటాడు. ఆ మాటలన్నీ విన్న రాజ్ ఆశ ఉన్నవాళ్లకు డబ్బు ఇవ్వడు దేవుడు అని అంటాడు. మనకు డబ్బుంది కాబట్టి మనం కొనిద్దాం. వాళ్లు నాకు తెలుసు. మమ్మల్న ఓసారి కాపాడారు అని కావ్య చెబుతుంది.

అలాంటి మంచి మనిషికి సహాయం చ...