Hyderabad, జూన్ 4 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్యతో మరో రూమ్‌లో రాజ్‌ను చూసిన రూమ్ బాయ్ పండు షాక్ అవుతాడు. సర్ మీరు ఇక్కడ అని పండు అంటే.. ఇందాక టిప్ ఇవ్వలేదనే కదా ఇదిగో తీసుకో అని డబ్బులు ఇస్తాడు రాజ్. సార్ ఇది మోసం అని పండు అంటే.. ఏంటయ్యా మోసం.. వంద ఇచ్చేదానికి వెయ్యి రూపాయలు ఇచ్చిన సరిపోదా మీకు అని కావ్య అంటుంది.

అది కాదు మేడమే ఇందాక 201 రూమ్‌లో అని పండు చెప్పబోతుంటే యూసఫ్.. నా ఫ్రెండ్ యూసఫ్ గురించే చెబుతున్నాడు. నేను చూసుకుంటా అది నువ్వు వెళ్లురా అని రాజ్ అంటాడు. వెళ్తాను. ఎక్కడ చెప్పాలో అక్కడే చెబుతాను అని కోపంగా పండు వెళ్లిపోతాడు. వాడేంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని కావ్య అంటే.. ఇందాక యూసఫ్‌తో చూశాడుగా. అదే అంటున్నాడు. ఇప్పుడు వాడికి నేను హైదరాబాద్ వెళ్లలేదని చెబితే ఫీల్ అవుతాడు. నేను వెళ్లి ఆపుతాను అని రాజ...