Hyderabad, జూన్ 16 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో నాకు యామినిని చంపాలని ఉంది. కానీ, మన ముందున్న లక్ష్యం పెళ్లి ఆపడం. కాబట్టి పంతులు చెప్పినట్లు చేయమని కనకంకు చెబుతుంది ఇందిరాదేవి. అమ్మవారి పూజ చేసిన పంతులు పూజ పూర్తి అయింది. హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకోమ్మని యామినికి చెబుతాడు పంతులు. అలాగే, హారతి మీద అందరి దృష్టిని ఉంచమని అది ఆర్పేయమంటూ కనకం వాళ్లకు హింట్ ఇస్తాడు పంతులు.

అది అర్థం చేసుకున్న కనకం ఫ్యాన్ దగ్గరికి వెళ్లి హారతి ఆర్పేందుకు ట్రై చేస్తుంది. కానీ, ఏం చేసిన ఫ్యాన్ పని చేయదు. యామిని హారతి ఇచ్చి కింద పెట్టబోతుంటే పంతులు ఆపి అన్ని విఘ్నాలు తొలగిపోవాలంటే మరో మూడు సార్లు హారతి ఇవ్వమని చెబుతాడు. అలా ఎక్కడ వినలేదు అని వేదేహి ప్రశ్నిస్తే పంతులు చిరాకు పడతాడు. అందరికి సమాధానం ఇచ్చుకుంటూ పోలేను అని కోప్పడతాడు.

దాంతో యామిని మరోసా...