Hyderabad, జూన్ 13 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో యామిని పెళ్లి ఏర్పాట్లు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. యామిని, కావ్య మధ్యలో వచ్చి రాజ్ నిలబడతాడు. యామిని పక్కనే రాజ్ నిల్చోగానే కావ్య చూస్తుంది. అది చూసి పక్కకు తప్పుకుంటాడు. కానీ, యామిని మాత్రం రాజ్‌ను దగ్గరికి లాక్కుంటుంది.

నవ ధాన్యాలు ముడుపు కట్టి రాట్నం కట్టండి అని పంతులు చెబుతాడు. రాట్నాన్ని వైదేహి పట్టుకుని బొట్టు పెడుతుంది. ఒక్కొక్కరుగా బొట్టు పెట్టి, అక్షింతలు వేస్తారు. రాట్నంను భూమిలో పెట్టి అక్షింతలు వేస్తాడు రాజ్. దానికి రాజ్, యామిని కలిసి ముడుపు కడతారు. అదంతా చూసిన కావ్య బాధగా ఫీల్ అవుతుంది. రాట్నంకు హారతి ఇవ్వమని, మీ ఫ్రెండ్ పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని అన్నారుగా అని కావ్యను అంటుంది యామిని.

కంగారెందుకు యామిని. నీ పెళ్లి నేనే జరిపిస్తాను. కానీ, హారతి పెద్దవాళ్లు ఇవ్వా...