Hyderabad, జూన్ 12 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ పెళ్లికి రుద్రాణి, రాహుల్‌ను రాకుండా ఆపాలి అని ఇందిరాదేవి చెబితే.. వాళ్లను రాకుండా తాను చూసుకుంటానని స్వప్న అంటుంది. ఈ తల్లీకొడుకులలను ఆపేస్తాను అని చెబుతుంది. ఆఫీస్‌లో అర్జంట్ వర్క్ పడితే సుభాష్‌ వెళ్లిపోయినట్లు అపర్ణ చెబుతుంది. కావ్య అందంగా, గ్లామర్‌గా రెడీ అయి వస్తుంది.

మనమేమైనా షాపింగ్‌కు వెళ్తున్నామా, పక్కింటి పెళ్లికి వెళ్తున్నామా.. చాలా సంతోషంగా రెడీ అయ్యావు అని అపర్ణ అంటే.. చెప్పాను కదా మా బ్రహ్మముడి అని కావ్య అంటుంటే.. ఆ బ్రహ్మముడి పురాణం ఆపు అని ఇందిరాదేవి అంటుంది. అంతా పెళ్లికి వెళ్తారు. మరోవైపు రాహుల్‌ను రుద్రాణి పిలిస్తే.. అప్పుడే బాత్రూమ్‌లో నుంచి రాహుల్ వస్తాడు. ఈపాటికే రెడీ అవ్వాలని తెలియదా అని రాహుల్‌ను తిడుతుంది రుద్రాణి.

ఆ యామినికేమో ఈ పెళ్లి ఆగకుండా చూస...