Hyderabad, జూలై 8 -- స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి మంగళవారం (జులై 8) ఎపిసోడ్లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఫుల్ ట్రైనింగ్ అంటూ కావ్యతోనే రాత్రంతా ఉంటాడు రాజ్. అటు అప్పూని ట్రాప్ లో ఇరికించడానికి యామిని ప్లాన్ చేస్తుంది. ఇటు రాజ్ సీక్రెట్ సిద్ధార్థ్ కు చెప్పడంతో కావ్య ప్రమాదంలో పడుతుంది.

బ్రహ్మముడి ఈరోజు (జులై 8) ఎపిసోడ్ కావ్య, రాజ్ కి కంపెనీ బాధ్యతల కోసం ట్రైనింగ్ ఇవ్వడంతో మొదలవుతుంది. కావ్య బెడ్‌పై ఫైల్స్ పడేసి, "రాజ్, ఈ ఫైల్స్ అన్నీ చదవాలి, రేపు బోర్డ్ మీటింగ్‌లో నీవు సిద్ధంగా ఉండాలి" అని చెబుతుంది. రాజ్ నిరాశగా, "ఇన్ని ఫైల్స్? నా వల్ల కాదు, కావ్య!" అని చేతులెత్తేస్తాడు. కావ్య ఓపికగా ఒక్కో ఫైల్ వివరిస్తూ, అలసిపోయి నిద్రలోకి జారుతుంది. అయినా, రాజ్ రాత్రంతా ఫైల్స్ చదివి పూర్తి చేస్తాడు. ఉదయం అపర్ణ, ఇందిరలు వచ్చి చూస్తే, కావ్య ఒడ...