Hyderabad, జూలై 30 -- స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు (జులై 30) ఎపిసోడ్ లో దుగ్గిరాల ఇంట్లో ఎంతో మార్పు కనిపిస్తుంది. బుల్లి స్వరాజ్ చేసే సందడితో అందరూ ఆనందంలో మునిగిపోతారు. తన కొడుకుని ఆప్యాయంగా చూసుకుంటున్న తల్లి, తండ్రిని చూసి రేవతి ఎమోషనల్ అవుతుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జులై 30) ఎపిసోడ్ రేవతి కొడుకు దుగ్గిరాల ఇంట్లోకి అడుగుపెట్టే సీన్ తో మొదలవుతుంది. అతడు వచ్చే సమయానికి అందరూ హాల్లోనే ఉంటారు. దీంతో అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఎవరీ పిల్లాడు అని అడుగుతారు. గుడిలో వాళ్ల అమ్మ కనిపించకుండాపోతే తాను తీసుకొచ్చానని అపర్ణ చెబుతుంది. స్వరాజ్ ను చూసిన స్వప్న తాను ఎక్కడో చూసినట్లు ఉందని అంటుంది.

అటు అప్పూ కూడా అలాగే అనడంతో రాజ్, కావ్య కంగారు పడతారు. గుర్తొచ్చిందంటూ స్వప్న చెప్పబోగా కావ్య అడ్డుపడి అతడు అత్తయ్య ఫ్రెండ్, నువ్వు అనుకున్న పిల్ల...