Hyderabad, జూలై 28 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఆరోజు రేవతి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఇలా బాధపడేవాళ్లం కాదు. అమ్మకు చెప్పంది ఏది చేసేదానివి కాదు. అలాంటిది ఇంతపెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావే అని రేవతిని అడుగుతుంది ఇందిరాదేవి.

ఇంట్లోవాళ్లను ఒప్పించే పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ, రుద్రాణి అత్తయ్య ఇచ్చిన సలహాతోనే ఇలా చేశాం అని జరిగింది చెబుతుంది రేవతి. జగదీశ్‌తో రేవతి కలిసి ఉండటం రుద్రాణి చూస్తుంది. ఈ అవకాశాన్ని మనం వాడుకోవాలి అని రేవతి దగ్గరికి వెళ్లి ప్రేమించడం తప్పేం కాదే. ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే తప్పు అని అంటుంది రుద్రాణి.

కూతురు డ్రైవర్‌న ప్రేమిస్తుందంటే నిన్ను కొడతారేమో, జగదీష్‌ను చంపేస్తారు. కాబట్టి, ఇంట్లో వాళ్లకు చెప్పకుండా పెళ్లి చేసుకో. అప్పుడే నీ ప్రేమ నిలబడుతుంది. నేరుగా పెళ్లి చేసుకుని వచ్చి అమ్మనాన...