Hyderabad, జూలై 26 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రేవతి పుట్టింటికి వస్తే అపర్ణ కోప్పడుతుంది. కావాలనే ప్లాన్ చేసి నాటకం ఆడి వచ్చిందేమో. నేను ఆరోజే చెప్పాను నువ్ అడుగు పెట్టడం అంటే నేను చచ్చినరోజే. ఏంటీ చూస్తున్నావ్. నేను చచ్చాననుకుని వచ్చావా అని అంటుంది.

అత్తయ్య నాకు ఇప్పుడే అర్థం అవుతుంది. ఆవిడ మీ కూతురు అని. నాకు ఆవిడ ఎవరో తెలియదు. అలాగే, నేను ఎవరో ఆమెకు తెలియదు. అందుకే నా మాట కాదనలేక వచ్చిందని కావ్య అంటుంది. అవును ఆంటీ మమ్మల్ని కాపాడిన ఆవిడను ఇలా అవమానించడం కరెక్ట్ కాదని స్వప్న అంటుంది. ఎప్పుడో జరిగిన గొడవకు ఇప్పుడు అవమానించడం ఏంటీ. మీ కూతురు అయితే ఇవాళ మంచిరోజున క్షమించవచ్చుగా అని కావ్య అంటుంది.

మరీ బాగుంది. ఆరోజు రేవతి ఏం చేసిందో తెలుసా అని చెబుతూ రెచ్చగొట్టేలా చేస్తుంది రుద్రాణి. ఇది తల్లీకూతుళ్లకు సంబంధించింది అని కావ్య...