Hyderabad, జూలై 25 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో స్వప్న కూతురికి ఒక్కొక్కరు గిఫ్ట్స్ ఇస్తారు. అందరూ ఇచ్చారు మనం ఇవ్వకపోతే పరువు పోతుంది, మీరు తెస్తారని నేను తేలేదు అని రాజ్ కావ్యతో అంటాడు. ముందు టెన్షన్ పెట్టిన కావ్య తర్వాత తీసుకొచ్చానని గిఫ్ట్ చూపిస్తుంది. దాంతో వెంటనే లాక్కుని రాజ్ తాను తెచ్చినట్లు గిఫ్ట్ ఇస్తాడు.

కావ్య మరి నీ గిఫ్ట్ ఏదని అంతా అడిగితే ఆయన ఇచ్చింది నాదే అని అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. ఆయన, నేను ఇద్దరం ఇచ్చిన ఒక్కటే అని కావ్య అంటుంది. తర్వాత రాహుల్ మరి తండ్రివి నీ గిఫ్ట్ ఏదని అడిగితే తాను తెచ్చిన డ్రెస్ తీసుకొచ్చి ఇస్తాడు. అది చూసి స్వప్న ఫైర్ అవుతుంది. కూతురుకి కొనే డ్రెస్సేనా అని నిలదీస్తుంది.

మీరెవరు నాకు డబ్బులు ఇవ్వట్లేదు. నా దగ్గరున్న వాటితో ఇది తెచ్చాను అని రాహుల్ అంటాడు. అలా అనడానికి సిగ్గు లేదా...