Hyderabad, జూలై 24 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు 782వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. యామిని ముందే రాజ్, కావ్య సరసాలు.. రేవతి గురించి చెప్పి అపర్ణ చేత తిట్లు తిన్న రుద్రాణి.. బర్త్ డే రోజు రుద్రాణి, రాహుల్ కొత్త ప్లాన్.. రేవతి గురించి కావ్య టెన్షన్ పడటంలాంటి ఘటనలు ఈ ఎపిసోడ్ లో జరిగాయి.

ఈ ఎపిసోడ్ రాజ్ ను యామిని ఇంట్లో డ్రాప్ చేయడానికి కావ్య వెళ్లే సీన్ తో మొదలవుతుంది. కారులో వెళ్తూ కావ్యకు ఎలా ప్రపోజ్ చేయాలా అని రాజ్ ఆలోచిస్తూ ఉంటాడు. కానీ కావ్య మాత్రం రేవతి ఇంటికి వస్తే ఎలా అని టెన్షన్ పడుతుంది. అదే సమయంలో మీ వయసు అయిపోతుంది కదా పెళ్లి గురించి ఆలోచించారా అని కావ్యను అడుగుతాడు రాజ్.

అయినా నన్ను ఏ వెధవ చేసుకుంటాడంటూ కావ్య అంటుంది. ఒకవేళ ఆ వెధవే వస్తే ఎలా అంటూ తనను తాను చూపిస్తూ రాజ్ అడుగుతాడు. ఇంతలో ఇల్లు వచ్చేస్తుంది. రాజ్ నిరాశగా కిందికి దిగ...