Hyderabad, జూలై 23 -- బ్రహ్మముడి సీరియల్ 781వ ఎపిసోడ్ ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా సాగింది. రేవతి గురించి రాజ్ తెలుసుకోవడం, ఆమెను రప్పించడానికి కావ్యతో కలిసి నాటకమాడటం, అటు రేవతి ఇంటికి రుద్రాణి, రాహుల్ వెళ్లడం, వాళ్ల ముందే తల్లి అపర్ణతో ఆమె మాట్లాడటంలాంటి ట్విస్టులు ఈ ఎపిసోడ్లో చూడొచ్చు. ఇంకా ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

బ్రహ్మముడి సీరియల్ కావ్య ఆందోళన చెందుతూ ఏదో ఆలోచిస్తున్న సీన్ తో బుధవారం (జులై 23) ఎపిసోడ్ మొదలైంది. ఆమె దగ్గరకు వచ్చిన రాజ్.. అంతా బాగా జరిగినప్పుడు మళ్లీ ఎందుకు పాత వాటి గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతున్నావని అడుగుతాడు. అప్పుడు రాజ్ కు రేవతి గురించి చెబుతుంది కావ్య.

ఆమె జగదీశ్ ను పెళ్లి చేసుకోవడం, ఇంట్లో నుంచి వాళ్లను వెళ్లగొట్టడం గురించి రాజ్ తెలుసుకుంటాడు. ఆమె ఎవరో తెలియకపోయినా అక్కా అని తాను...