Hyderabad, జూలై 22 -- బ్రహ్మముడి సీరియల్ 780వ ఎపిసోడ్ మొత్తం కొన్ని ట్విస్టులతో ఇంట్రెస్టింగా సాగింది. లంచం కేసు నుంచి అప్పు సేఫ్ గా బయటపడుతుంది. అయితే కోర్టులోనే యామినికి కావ్య, రాజ్ వార్నింగ్ ఇస్తారు. అటు జగదీశ్ ను ఫాలో చేసుకుంటూ రేవతి ఇంటికి వెళ్తుంది రుద్రాణి. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

అప్పూని లంచం కేసులో నుంచి బయటపడేసిన తర్వాత రాజ్ కు కోర్టులోనే అప్పూ, కల్యాణ్ థ్యాంక్స్ చెబుతారు. కానీ కావ్య మాత్రం థ్యాంక్స్ చెప్పకపోవడంతో అసలు చెప్పాల్సిన వాళ్లే చెప్పడం లేదని రాజ్ అంటాడు. చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టారంటూ మొదట థ్యాంక్స్ చెప్పని కావ్య తర్వాత చెబుతుంది. అయితే తాను మాత్రం ఇంకా సంతోషంగా లేనని, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకోలేకపోయానని రాజ్ అంటాడు.

అప్పుడు కావ్య జోక్యం చేసుకుంటూ.. అక్కడే ఉన్న యామిని ముందే ఆమెకు వార్నింగ్ ఇస్తుంది. ఇ...