Hyderabad, జూలై 21 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కోర్టులో కావ్యను విచారించాలని లాయర్ చెప్పడంతో బోనులో నిల్చుంటుంది కావ్య. కావ్య బెయిల్ ఇప్పించడాన్ని తప్పు బడతాడు లాయర్. శీను ఇంటికి వెళ్లింది అడిగితే కావ్య వెళ్లినట్లు చెబుతుంది. శీనును బెదిరించడానికి ప్రయత్నించారు. మాట వినకపోవడంతో మాయం చేశారు అని పీపీ లాయర్ అంటాడు.

అబద్ధం అని కావ్య అరుస్తుంది. నా చెల్లి ఏ తప్పు చేయలేదు. అది అడగడానికే వెళ్లానని కావ్య చెబుతుంది. తర్వాత కావ్యను వెళ్లమంటాడు లాయర్. నేను చెప్పానుగా కావ్య. నువ్వు ఇచ్చిన సాక్ష్యంతోనే నీ చెల్లికి శిక్ష పడుతుంది అని యామిని అంటుంది. అప్పు తన పోలీస్ బ్రెయిన్ ఉపయోగించి అక్కను పంపించారని పీపీ అంటే.. అప్పు తనను తాను డిఫెండర్ చేసుకుంటుంది.

దొరికిపోయాక ఇలా చెబుతున్నారని లాయర్ అంటాడు. కావ్య టెన్షన్ పడుతూ రాజ్‌కు కాల్ చేస్తుంది....