Hyderabad, జూలై 19 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో శీనుగాడు వాళ్ల అమ్మ కోసం కచ్చితంగా కాల్ చేస్తాడు. అప్పుడు వాడి సిగ్నల్ కనిపెట్టి అప్పును కాపాడవచ్చు అని రాజ్ అనుకుని రేవతికి కాల్ చేసి సహాయం అడుగుతాడు. శీను కచ్చితంగా వాళ్ల అమ్మకు కాల్ చేస్తాడు. ఈ ఒక్కరోజు వాళ్ల అమ్మతో ఉన్నావంటే వాడు కాల్ చేసింది తెలుస్తుంది. అప్పుడు నాకు చెప్పావంటే వాడిని పట్టుకోవచ్చు అని రాజ్ అంటాడు.

సరే అని రేవతి అంటాడు. మరుసటి రోజు ఉదయం కోర్టులో రాజ్, కావ్య, అప్పు, కల్యాణ్ కోర్ట్ హియరింగ్ ఉందని టెన్షన్ పడతారు. రేవతికి కాల్ చేసింది చెబుతాడు రాజ్. ఇంతలో రేవతి కాల్ చేసి రాత్రి శీను కాల్ చేసిన విషయం చెబుతుంది. పడుకున్న రౌడీ రంగా నుంచి ఫోన్ తీసుకుని తల్లికి శీను కాల్ చేస్తాడు. అసలు ఏమైందిరా అని శీను తల్లి అడిగితే నిజంగా కిడ్నాప్ కాలేదు. ఇదంతా నాటకం అని శీను చెబుత...