Hyderabad, జూలై 18 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కూతురు రేవతిని ఇంట్లోంచి గెంటేస్తుంది అపర్ణ. నా కూతురు చనిపోయి చాలా సేపు అయిందని సుభాష్ అంటాడు. దాంతో నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని జగదీష్ అంటాడు. ఇంట్లోకి వెళ్లి వచ్చి ఆస్తి పేపర్స్ పడేస్తుంది అపర్ణ. మీ నాన్న నీకోసం కొన్న ఆస్తి, దీనికోసమే వాడు నిన్ను పెళ్లి చేసుకుని ఉంటాడు. మాకెందుకు అని పారేస్తుంది అపర్ణ.

వాటిని ఏరి తిరిగి సుభాష్ కాళ్ల కింద పెడుతుంది. ఈ ఆస్తితో నాకు పనిలేదు. ఏదో ఒక రోజు నా తప్పు లేదని మీరు పిలిచేవరకు ఈ ఇంటికి నేను అడుగు పెట్టను అని రేవతి అంటుంది. అది నేను బతికి ఉన్నంతవరకు జరగదు అని అపర్ణ అంటుంది. దాంతో రేవతి, జగదీష్ వెళ్లిపోతారు. అందుకే ఇలా దొంగతనంగా కలుస్తున్నానని కావ్యకు ఇందిరాదేవి చెబుతుంది.

అన్ని విషయాలు షేర్ చేసుకునే రేవతి గారు మరి పెళ్లి విషయం...