Hyderabad, జూలై 17 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రేవతి గురించి అత్తయ్యను అడుగుతానని ఇందిరాదేవితో కావ్య అంటుంది. దాంతో కొంపలు అంటుకుంటాయని ఇందిరాదేవి అంటుంది. తెలిసి తెలియని చేసిన ఆ పొరపాటుకి 15 ఏళ్ల నుంచి బాధపడుతూనే ఉంది. ఆ రేవతి అపర్ణ కూతురు. నా మనవడికి అక్క, నీకు సొంత వదిన. అకారణంగా అన్యాయం అయిపోయిన నా మనవరాలు అని ఇందిరాదేవి అసలు సీక్రెట్ చెబుతుంది.

రేవతి గారు ఈ ఇంటి ఆడపడుచా. అలాంటి అమ్మాయిని ఎందుకు వదులుకున్నారు. అసలు ఏం జరిగింది అని షాక్‌తో అడుగుతుంది కావ్య. దాంతో జరిగింది నిజం చెబుతుంది ఇందిరాదేవి. ఇంట్లో రేవతిని అల్లారుముద్దుగా చూసుకోవడం, రాజ్ కంటే ఎక్కువగా గారాబం చేయడం చెబుతుంది ఇందిరాదేవి. మహాలక్ష్మీ పుట్టిందని నెత్తిన పెట్టుకుని చూసుకున్నారని చెబుతుంది.

పెళ్లి గురించి కూడా ఆలోచించడం, దగ్గరి బంధువులతో చేస్తే కళ్లముందే...