Hyderabad, జూలై 16 -- స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి బుధవారం (జులై 16) ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఓవైపు అప్పూ, శీనుగాడి ఎపిసోడ్.. మరోవైపు రేవతి, ఇందిరాదేవి ఎపిసోడ్.. ఇంకోవైపు కావ్య, రాజ్ ఎపిసోడ్.. ఇలా ఎన్నో ట్విస్టులు ఇస్తూ సాగిపోయింది. చివరికి రేవతి ఎవరో కాదు అపర్ణ కూతురు అని కావ్య తెలుసుకుంటుంది.

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రాజ్.. ఇందిరాదేవిని బస్తీలో చూసి ఇక్కడేం చేస్తున్నావని నిలదీసే సీన్ తో మొదలవుతుంది. ఇద్దరూ కాసేపు మాటలు కాకుండా విజిల్స్ తో పలకరించుకుంటారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటే.. నువ్వు ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించకుంటారు. కావ్య మాట్లాడుతూ.. "ఈ బస్తీలో మీకు ఏం పని? ఇక్కడ నీకు తెలిసినవాళ్లు ఎవరూ లేరు కదా?" అని సందేహంగా అడుగుతుంది.

ఇందిర స్పందిస్తూ.. "బస్తీలో మనుషులు ఉండరా? వాళ్లతో పని ఉండదా?" అని తిరిగి ప్రశ్నిస్...