Hyderabad, జూలై 15 -- బ్రహ్మముడి సీరియల్ 774వ ఎపిసోడ్ ఎంతో ఆసక్తి రేపింది. అపర్ణ తన మనవడు స్వరాజ్ తో సరదాగా ఆడుకోవడం, ఇందిరాదేవి ఇచ్చిన డబ్బును రేవతి వద్దనడం, శీనుగాడి ఇంటికి రాజ్, కావ్య వెళ్లడం.. అతడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకోవడం, అటు రేవతి ఇంటి దగ్గరే ఇందిరా దేవిని రాజ్, కావ్య చూడటం లాంటి సీన్లతో ఎపిసోడ్ అంతా ఉత్కంఠ రేపేలా సాగింది.

రేవతి ఇంటికి వెళ్లిన ఇందిరాదేవి వాళ్లతో మాట్లాడే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు (జులై 15) ఎపిసోడ్ ప్రారంభమవుతుంది. రేవతిని తల్లి, కుటుంబంతో కలిపే బాధ్యత తనది అని వాళ్లతో ఇందిరాదేవి హామీ ఇస్తుంది. తనను నమ్మి వచ్చిన రేవతిని సరిగా చూసుకోలేకపోతున్నానని, ఈ పేదరికమే తనకు ఇచ్చానని అటు జగదీశ్ బాధపడతాడు.

ఏమీ బాధపడొద్దని, కుటుంబానికి దగ్గర చేసే బాధ్యత తనదని వాళ్లతో ఇందిర చెబుతుంది. అయితే అంత వరకూ ఈ డబ్బు వాడుకోండన...