Hyderabad, జూలై 14 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో ఇంట్లో అత్తారింటికి దారేది సినిమా సీన్‌లోలాగా రుద్రాణి, రాహుల్ ఎలాంటి పాత్రలు చేసినా ఏదో ఒక కారణం చెప్పి వాళ్లను కొడతారు. తర్వాత రాహుల్, రుద్రాణి కానిస్టేబుల్ వేషం వేస్తారు. అయినా కూడా ఇంట్లోవాళ్లు కొడతారు. ఆంటీ ఎలా ఉందని రాజ్ అంటాడు.

నిజం తెలుసుకోడానికి ప్రయత్నించమంటే మమ్మల్ని ఇంతలా బలి చేయాలా అని పారిపోతారు రాహుల్, రుద్రాణి. అప్పు డల్‌గా ఉండటం చూసి ఓదార్చుతారు. శీను గాడి అడ్రస్‌ను రాజ్ అడిగితే రెహమత్ నగర్ అని అప్పు చెబుతుంది. దాంతో రేవతి అక్కవాళ్లు అక్కడే ఉంటారుగా. వాడి గురించి అడిగితే తెలుస్తుందిగా అని రాజ్ అంటాడు.

దాంతో రాజ్, కావ్య శీనును వెతకడానికి వెళ్తారు. మరోవైపు ఒళ్లు నొప్పులతా బాధపడుతారు రుద్రాణి, రాహుల్. నిన్ను చంపేయాలని ఉంది మామ్. తగుదునమ్మా అని వెళ్లి తన్నించుకునేల...