Hyderabad, జూలై 12 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య, అప్పు గురించి ఆలోచించిన రాజ్ కళావతికి కాల్ చేస్తాడు. ఏం జరిగిందని అడుగుతాడు. బెయిల్ మీద తీసుకొచ్చాను. కానీ, కేసులో నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు అని కేసు గురించి చెప్పి కావాలనే ఇరికించారు అని చెబుతుంది కావ్య. రెండ్రోజుల్లో అప్పును కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ఈలోపు తప్పు చేసినవాళ్లను పట్టుకుని నిజం నిరూపించాలి. లేకుంటే అప్పు జాబ్ పోవడమే కాదు అరెస్ట్ కూడా అవుతుందని కావ్య చెబుతుంది.

ఇద్దరం కలిసి వాళ్లు ఎవరో పట్టుకుందాం. అప్పును కేసులో ఇరికించింది ఎవరైనా సరే వదిలేది లేదని రాజ్ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అపర్ణ, ఇందిరాదేవి ఏమైందని అడిగితే.. రాజ్ హెల్ప్ చేస్తానంటున్నారని, నేనే వద్దంటున్నాని కావ్య చెబుతుంది. ఎందుకని వాళ్లంటే అప్పుని కేసులో ఇరికించింది యామినినే, సిద్ధార్థ్‌ను రెచ్చగ...