భారతదేశం, జనవరి 9 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ అరెస్ట్ కావడంతో కావ్య తెగ కంగారు పడుతుంది. ఆయన ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటని కావ్య బాధపడుతుంది. ఇదంతా ఎవరో ప్లాన్ ప్రకారం చేశారనిపిస్తుందని కల్యాణ్ అంటాడు. అప్పు ఏదో ఒకటి చేయవే. ఎలాగైనా మీ బావను బయటకు తీసుకురా. నిన్న నా బిడ్డకు ప్రమాదం తలపెట్టారు, ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేయించారని కావ్య తల్లడిల్లిపోతుంది.

కావ్య టెన్షన్ పడుతూ నొప్పులతో అరుస్తుంది. ఏడో నెలలో నొప్పులు ఏంటీ అని ఇందిరాదేవి భయపడుతుంది. కావ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. డాక్టర్ చెక్ చేస్తుంది. సుభాష్ పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. నాకు మా ఆయన్ను చూడాలని ఉంది. పిలిపించండి అని కావ్య కంగారుగా చెబుతుంది. సరేనంటుంది డాక్టర్.

బయటకొచ్చిన డాక్టర్ కావ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉంది. వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయాలి. పెయ...