భారతదేశం, జనవరి 8 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో బిడ్డను రుద్రాణి చంపాలనుకున్నది కావ్య తట్టుకోలేకపోతుంది. రాజ్ వచ్చి ఓదారుస్తాడు. మా అమ్మ చూడకపోతే మన బిడ్డ మీద మనమే మట్టి పోసుకునే పరిస్థితి వచ్చేదని కావ్య అంటే అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకని రాజ్ అంటాడు.

దేవుడు మనకు అండగా ఉన్నాడు. అందుకే మనకి చివరి క్షణంలో తెలిసింది అని రాజ్ అంటాడు. ఇందరి మంచి మనుషుల నుంచి ఒకరి రాక్షసత్వం బయటపడిందంటే భయంగా ఉంది. ముందు ముందు మన బిడ్డకు ఏ వైపు నుంచి ప్రమాదం వస్తుందో అని భయంగా ఉంది. హాస్పిటల్‌లో నా బిడ్డకు భద్రత ఉండదనిపిస్తుంది. నా జన్మనిచ్చే సమయంలో మీరు నా పక్కనే ఉంటానని నాకు మాట ఇవ్వండి అని కావ్య అంటుంది.

మీరు లేకుంటే ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా వెళ్లను. నా పక్కనే ఉంటానని నాకు మాట ఇవ్వండి అని కావ్య చేయి చాపుతుంది. చేతిలో చేయి వేసి రాజ్ మాట ఇస్తా...