భారతదేశం, జనవరి 7 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 924వ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. రుద్రాణి కుట్రను భరించలేని ఇంట్లో వాళ్లు ఆమెను నానా మాటలు అంటారు. చివరికి ఇందిరా దేవి ఆమెను మెడపట్టి బయటకు గెంటేస్తుంది. కానీ ఆ సమయానికి నాటకమాడి ఆ ఇంట్లోనే ఉండిపోతారు రాహుల్, రేఖ. వాళ్ల కుట్రకు రాజ్ బలవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 7) ఎపిసోడ్ రుద్రాణి కుట్రను కనకం బయటపెట్టే సీన్ తో మొదలవుతుంది. ఆమె తీసుకొచ్చిన వీరయ్యను సుభాష్ నాలుగు పీకడంతో అతడు నిజం చెబుతాడు. రుద్రాణియే ఇదంతా చేసిందని అంటాడు. దీంతో నువ్వు మనిషివేనా అంటూ ఆమెపై మండిపడతాడు సుభాష్. అటు అపర్ణ, ఇందిర, కావ్య, రాజ్ కూడా రుద్రాణిని నానా మాటలు అంటారు. ఈ ఇంటి మనిషివి కాకపోయినా.. నా బావ అడిగినందుకు నిన్ను ఇంటి ఆడపడచులా చేసుకున్నామని, ఇంతటి దారుణానికి తెగిస...