భారతదేశం, జనవరి 6 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 923వ ఎపిసోడ్ లో రుద్రాణి బాగోతం పూర్తిగా బయటపడుతుంది. దీంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఇందిరా దేవి. అయితే తన పిల్లలను మాత్రం ఆ ఇంట్లోనే ఉంచి.. దుగ్గిరాల కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడానికి రుద్రాణి పెద్ద ప్లానే వేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 6) ఎపిసోడ్ కావ్య, కనకం ఎమోషనల్ అయ్యే సీన్ తో మొదలవుతుంది. తన కాపురం నిలబెట్టుకోవడానికి తనకు ఓర్పు, నేర్పు కలిసి వచ్చాయని కావ్య అనడంతో కనకం ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిరా దేవి తల్లీకూతుళ్లను ఆటపట్టిస్తుంది. తర్వాత కావ్యను పొగుడుతుంది. కావ్య ఉన్న చోట సంతోషమే తప్ప దు:ఖం ఉండదని అంటుంది. ఇదంతా అక్కడే ఉండి గమనించిన రేఖ, రుద్రాణి.. ఆ సమయంలో కషాయంలో పసరు మందు కలపొద్దని వెళ్లిపోతారు.

ఇటు కావ్య, అప్పు శ్రీమంతం వేడుకలు మొ...