భారతదేశం, జనవరి 3 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్‌తో డ్యాన్స్ చేయడాన్ని తలుచుకుని మురిసిపోతుంది రేఖ. పక్కనే రుద్రాణి ఉంటుంది. ఇంతలో రాహుల్ వచ్చి రాజ్ కార్ తీసుకుంది చూపిస్తాడు. రాజ్ కారులో దొంగ బంగారం పెట్టేయ్. దొంగ బంగారం కొన్నాడన్న కేసులో పూర్తిగా ఇరికించేయ్ అని రుద్రాణి అంటుంది.

ఎవరు చూడని టైమ్‌లో పెట్టాలి. వెంటనే పోలీసులను రప్పించాలి. కంపెనీని పడగొట్టాలి అని రాహుల్ అంటాడు. రాజ్ బావను ఇరికిస్తారా. కాబోయే భర్త జైలులో ఉంటే బాగుండదుగా. బావను జైలుకు పంపిస్తే నా వాడు ఎలా అవుతాడు అని రేఖ అడుగుతాడు. నేను నెంబర్ వన్ కావాలంటే రాజ్ జైలుకు వెళ్లాలి అని రాహుల్ కోపంగా అంటాడు.

రాజ్‌కు అన్ని పోయి ఒంటరివాడు కావాలి. అప్పుడు మనం చెప్పినట్లు వింటాడు. కావ్య కడుపు పోవాలి, రాజ్ దొంగ బంగారం కేసులో ఇరుక్కోవాలి. ఈ రెండు జరుగుతునే రాజ్ నీవాడు అవ...