భారతదేశం, జనవరి 29 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో లేడి డాక్టర్‌ అనురాధను డాక్టర్ చక్రవర్తి ఇంటి అడ్రస్ గురించి కావ్య అడిగితే తనకు తెలియదని చెబుతుంది. కానీ, హెడ్ నర్స్ నీలవేణికి తెలిసే అవకాశం ఉంటుందని అనురాధ చెబుతుంది. మరోవైపు మరో నర్స్‌తో తన మెడలో చైన్ పది లక్షలు అని గొప్పలు చెప్పుకుంటుంది నీలవేణి.

ఇంత డబ్బు ఎక్కడిది అని మరో నర్స్ అడిగితే.. మనం తలుచుకుంటే డబ్బుకు కొదవ ఏంటీ. ఎవరికైనా కాసింత హెల్ప్ చేస్తే చాలు డబ్బే డబ్బు. ఎవరైనా పెద్దవారికి హెల్ప్ చేయడానికి చాలా దారులు ఉన్నాయని హెడ్ నర్స్ నీలవేణి అంటుంది. ఆ మాటలన్నీ అనురాధ, కావ్య వింటారు. అయితే నీకు చాలా అడ్డ దారులు తెలుసు అన్నమాట అని కావ్య అనగనే నీలవేణి కంగారుపడుతుంది.

ఏంటండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని నీలవేణి అంటే.. కావ్య ఒక్కటి లాగిపెట్టి కొడుతుంది. నిజం చెప్పమని అ...