భారతదేశం, జనవరి 28 -- బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ మంచి ట్విస్టులతో సాగింది. మంత్రి ధర్మేంద్ర దగ్గర ఉన్న పాపే తన పాప అని సాక్ష్యాలతో సహా కావ్య గుర్తిస్తుంది. మంత్రి ఇంటికి వెళ్లి మరీ ఫైల్ ను అతని మొహాన కొడుతుంది. తన పాపను తాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఇటు రాజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రేఖ ప్రయత్నిస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 28) ఎపిసోడ్ లో గుడిలో తులసి దగ్గర ఉన్న బిడ్డ ఏడుస్తూనే ఉండటంతో కావ్య వెళ్లి జోల పాటు పాడుతుంది. ఆ పాట వినగానే పాప ఏడుపు మానుతుంది. అది చూసి ధర్మేంద్రలో టెన్షన్ మొదలవుతుంది. వెంటనే పక్కనే ఉన్న రుద్రాణి దగ్గరికి వెళ్లి.. కావ్య రాదన్నావ్.. ఎలా వచ్చిందని నిలదీస్తాడు. ఏదో అనుకోకుండా వచ్చినట్లుంది.. దానికి అంతలా రియాక్టవ్వాల్సిన అవసరం లేదని అంటుంది.

ఇటు కావ్య చేసిన పనికి తులసి ఆమెను మె...