భారతదేశం, జనవరి 27 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 940వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. తన అసలు పాప కోసం కావ్య మరింత తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే గుడిలో కావ్యకు మంత్రి ధర్మేంద్ర అడ్డంగా దొరికిపోతాడు. దీంతో వెంటనే పూజను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పారిపోతాడు.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ డాక్టర్ దగ్గరకు కావ్య వెళ్లే సీన్ తో మొదలవుతుంది. ఆమెను చూడగానే డాక్టర్ సీరియస్ అవుతుంది. కానీ కావ్య మాత్రం ఓ డాక్టర్ లా కాకుండా ఓ తల్లిలా ఆలోచించండి.. తన దగ్గర ఉన్న పాప తనను తాకినా ఆ మాతృత్వపు మాధుర్యం తనకు కలగడం లేదని కంటతడి పెడుతూ అంటుంది. కావ్య మాటలకు డాక్టర్ కరిగిపోతుంది. తానేం చేయాలని అడుగుతుంది. తనకు డెలివరీ అయిన రోజు ఇంకా ఎవరెవరికీ అయ్యాయో చెబితే తాను వెతుక్కుంటానని అంటుంది. డాక్టర్ సరే అంటుంది.

ఇటు ఇంట్లో పాప...