భారతదేశం, జనవరి 26 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పాపకు గుండె సమస్య గురించి డాక్టర్ చెబుతుంది. వెంటనే ఆపరేషన్ చేయమని రాజ్ అంటాడు. చిన్న పాప కాబట్టి బాడీ తట్టుకుంటుందో లేదో. ఆపరేషన్ చేయకుండా చాలా ఇబ్బంది. సర్జరీ చేస్తే పాప ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వలేం. కానీ, మీరు నిర్ణయం తీసుకుంటే ఏదోటి చేయొచ్చు అని డాక్టర్ అంటుంది.

ఈ పాపను ఇక్కడే ఉంచి నా పాపను నాకు ఇవ్వండి. ఎవరి బిడ్డకో ఆరోగ్యం సరిగా లేదు. హెల్తీగా ఉన్న నా బిడ్డను మార్చారు. అంతా ఒక్కటై మా మీద కుట్ర చేశారు అని కావ్య అంటుంది. మీ భార్యకు నచ్చజెప్పండి. వ్యాధి గురించి చెబితే ఇలా అంటోంది ఏంటీ అని డాక్టర్ అనురాధ తిడుతుంది. దాంతో కావ్యను బలవంతంగా రాజ్ తీసుకెళ్తాడు.

కావ్య గొడవ చేసి హెడ్ నర్స్ నీలవేణి భయపడిపోతుంది. రాజ్, కావ్య ఇంటికి వెళ్తారు. పాపకు ఏమైందని అంతా అడిగితే.. కావ్య చేసిన పని...