భారతదేశం, జనవరి 24 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య దగ్గర ఉన్న పాపకు నోట్లో నుంచి నురగ రావడం, శరీర రంగు మారడంతో కంగారు పడుతుంది కళావతి. వెళ్లి రాజ్‌కు, ఇంట్లోవాళ్లకు చెబుతుంది. అంతా టెన్షన్ అవుతారు. హాస్పిటల్‌కు రాజ్, కావ్య తీసుకెళ్తారు. డాక్టర్ అనురాధ గురించి డాక్టర్ చక్రవర్తిని రాజ్ అడుగుతారు.

పాప రంగు మారడం చూసి చక్రవర్తి షాక్ అవుతాడు. పక్కన ఉన్న నర్స్‌కు తను బిడ్డలను మార్చింది గుర్తుపడుతుంది. అనురాధ మేడమ్ ఆపరేషన్ థియేటర్‌లో ఉందని డాక్టర్ చక్రవర్తి పాపను చెక్ చేస్తాడు. డాక్టర్ వచ్చి ట్రీట్‌మెంట్ చేశాం. పాప నార్మల్ అయింది. టెస్ట్‌లు చేశాం. రిపోర్ట్స్ చూశాక ఏంటనేది తెలుస్తుందని చెబుతాడు. కావ్య, రాజ్ వెళ్లి పాపను చూస్తారు.

కళావతి ఏడుస్తుంది. రాజ్ ఓదారుస్తాడు. మరోవైపు పాప రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్ చక్రవర్తికి నర్స్ ఇస్తుం...