భారతదేశం, జనవరి 22 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య చెప్పినదాంట్లో నిజం లేదని మనమెందుకు ఆలోచించకూడదు అని ఇందిరాదేవి, అపర్ణ అంటారు. నాకు కూడా కళావతి మాటల్లో నిజమనిపిస్తుంది, కానీ, ఆ పాప మన పాప కాదని చెప్పడానికి ఏదో ఒక సాక్ష్యం ఉండాలిగా డాక్టర్స్‌ని అడిగితే ఒప్పుకోరు, ఈ సమస్య చాలా పెద్దది అని రాజ్ అంటాడు.

చట్ట ప్రకారం వెళ్దాం బావ. డీఎన్‌ఏ టెస్ట్ చేపిద్దాం. కోర్టులో వేసిన డీఎన్‌ఏ టెస్ట్ గురించి అడుగుతారు. దాని వల్ల రెండు లాభాలు. మ్యాచ్ అయితే కోర్టులో కేసు వేయొచ్చు, మ్యాచ్ అయితే అక్కే నమ్ముతుంది అని అప్పు అంటుంది. దానికి సరే అని రాజ్ అంటాడు. డీఎన్‌ఏ టెస్ట్‌కు ఒప్పించడానికి కావ్య దగ్గరికి వెళ్తాడు రాజ్.

నువ్వు చెప్పింది నిజమనిపిస్తుంది, నీ మాటల్లో నిజమనిపిస్తుందని, డీన్‌ఏ టెస్ట్ చేపిద్దాం, దాని ద్వారా ఈ పాప మన బిడ్డ కాదో తేలుతు...