భారతదేశం, జనవరి 20 -- బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 934వ ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. హాస్పిటల్లో బిడ్డలను తీసుకొని ఎవరికి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోతారు ఇటు కావ్య, అటు తులసి. అయితే ఇంటికి వెళ్లినా ఆ బిడ్డ తన బిడ్డ కాదని కావ్య వాదించడంతో ఇక లాభం లేదనుకొని డీఎన్ఏ టెస్టుకు సిద్ధమవుతాడు రాజ్. అందుకు కావ్య సరే అంటుంది.

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్ కావ్యను హాస్పిటల్ ను రెండు రోజుల ముందే డిశ్చార్జ్ చేయాల్సిందే అని డాక్టర్ చెప్పడంతో మొదలవుతుంది. తన బిడ్డ కోసం ఆమె హాస్పిటల్లో చేసిన గొడవతో ఆమెను తీసుకెళ్లాల్సిందే అని చెప్పడంతో రాజ్ కు మరో దారి లేక సరే అంటాడు.

కావ్య దగ్గరికి వెళ్లి ఇదే విషయం చెబితే ఆమె తన పాపను ఇస్తేగానీ వెళ్లేది లేదని తేల్చి చెబుతుంది. పాపను కూడా చేతుల్లోకి తీసుకోకపోవడంతో రాజ్ తీసుకుంటాడు. ఎంత చెప్పినా వినకపోవ...