భారతదేశం, జనవరి 2 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో దుగ్గిరాల ఇంట్లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్ నడుస్తుంది. సీతారామయ్య చీటి తీస్తే మంచి పద్యం పాడాలని వస్తుంది. తాతయ్య పద్యం చెబుతాడు. అందరు ఆశ్చర్యపోయి మెచ్చుకుంటారు. రాజ్‌తో రేఖ క్లోజ్‌గా ఉంటుంది. అది కావ్య చూసేసరికి రాజ్ భయపడి తప్పుకుంటాడు.

ప్రకాశం, ధాన్యలక్ష్మీ వచ్చి చీటి తీస్తే డ్యాన్స్ చేయాలని వస్తుంది. ఇదేమిటమ్మా మాయ మాయ పాటకు ఇద్దరు డ్యాన్స్ చేస్తారు. రాహుల్, స్వప్న చీటి తీస్తే డమ్‌షరాడ్స్ వస్తుంది. రాహుల్ సినిమా పేరును సైగలతో చేస్తే స్వప్న చెప్పాలి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అని గెస్ చేస్తుంది స్వప్న. తర్వాత రుద్రాణి చీటి చీస్తే బాలయ్య బాబు డైలాగ్ చెప్పాలని వస్తుంది.

చూడు ఒకవైపే చూడు అనే డైలాగ్ చెప్పి రుద్రాణి తొడ కొడుతుంది. భయపడి చచ్చానని ఇందిరాదేవి, చెత్తలా ఉందని ధ...