భారతదేశం, జనవరి 15 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో డాక్టర్‌తో కావ్య కోపరేట్ చేస్తుంది. ఆపరేషన్ చేయమని రాజ్ అంటాడు. కానీ, డాక్టర్ కోప్పడుతుంది. క్రిమినల్ ఉండగా ఆపరేషన్ చేయలేం, మా హాస్పిటల్‌కు చెడ్డపేరు వస్తుందని డాక్టర్ అంటుంది. నా భార్య బిడ్డకు ప్రాణం పోయాలంతే ప్రాణాలతో ఉండాలి. నా భార్య ప్రాణం నేనే. అందుకు నేనే ఇక్కడే ఉండాలి అని వేడుకుంటాడు రాజ్.

నా భార్య డెలివరి అవ్వగానే బిడ్డను చూసి వెళ్లిపోతానని రాజ్ అంటాడు. కావ్య కూడా వేడుకుంటుంది. దాంతో డాక్టర్ ఒప్పుకుంటుంది. మరోవైపు బావ ఇంకా కేసులో ఇరుక్కోవద్దనే అరెస్ట్ చేస్తానని అన్నాను అని అప్పు అంటుంది. అయినా ఇంట్లోవాళ్లు వినరు. అప్పును తిడతారు.

నా పరిస్థితి అర్థం చేసుకోండి. ఆఫ్ డ్యూటీలో ఉన్న నాకు ఆర్డర్స్ వచ్చాయంటే ఎంత ప్రెజర్ ఉందో తెలుసుకోండి అని అప్పు అంటుంది. అంత డ్యూటీ చేయాలనుకుంట...