భారతదేశం, జనవరి 14 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో పోలీస్ స్టేషన్ నుంచి అన్న రాజ్‌ను కల్యాణ్ తప్పిస్తాడు. దాంతో రాజ్ హాస్పిటల్‌కు వస్తాడు. అక్కడ ఎస్సై ఆర్డర్‌తో రాజ్‌ను అడ్డుకుంటుంది అప్పు. అడ్డుపడిన దుగ్గిరాల ఇంటి సభ్యులు రాజ్‌ను కావ్య దగ్గరికి పంపిస్తారు.

కావ్య దగ్గరికి వెళ్లిన రాజ్ ప్రేమగా మాట్లాడుతాడు. మీరే కదండి నా ధైర్యం, ఆత్మ విశ్వాసం అంటూ సంతోషిస్తుంది కావ్య. ఒకరినొకరు ప్రేమగా మాట్లాడుకుంటారు. మీరు వచ్చారుగా. ఇక నాకు ఏం కాదు. ఆపరేషన్ చేయించుకుంటాను అని కావ్య చెబుతుంది. దాంతో రాజ్ సంతోషిస్తాడు.

ఇంతలో డాక్టర్ వస్తుంది. రాజ్‌పై మండిపడుతుంది డాక్టర్. నేను ఏం చెప్పాను. మీరు ఏం చేశారు. నేను కావ్యకు భర్తగా, దుగ్గిరాల ఇంటి కొడుకుగా ఇక్కడికి రమ్మన్నాను. కానీ, ఇలా క్రిమినల్‌గా హాస్పిటల్‌కు రమ్మనలేదు అని డాక్టర్ అంటుంది. తప్పు చేస...