భారతదేశం, జనవరి 13 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కల్యాణ్‌కు కాల్ చేసిన రాజ్ పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి తాను చెప్పినట్లు చెప్పమని అంటాడు. కల్యాణ్ ఒప్పుకుంటాడు. ఓ ఫ్రెండ్‌కి కాల్ చేసిన కల్యాణ్ కానిస్టేబుల్ దేవరాజు ఉంటాడు. అతనికి ఇంటి నుంచి క్యారియర్ వచ్చిందని చెప్పి బరువుగా ఉండే లంచ్ బాక్స్ పట్టుకెళ్లి ఇవ్వు అని చెబుతాడు.

కల్యాణ్ ఫ్రెండ్ అలాగే చేస్తాడు. అదే విషయం కల్యాణ్‌కు చెబుతాడు. తర్వాత పోలీస్ స్టేషన్‌కు కాల్ చేసి బాంబ్ పెట్టారని, ఇందాకా తీసుకొచ్చిన క్యారేజ్‌లో టిఫిన్ బాంబ్ పెట్టారు అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా అలర్ట్ అయి క్రిమినల్స్ అందరిని బయటకు తీసుకురమ్మని ఎస్సై చెబుతాడు. రాజ్‌తోపాటు అందరిని బయటకు తీసుకొస్తారు.

కల్యాణ్ వచ్చి రాజ్‌ను పిలుస్తాడు. దాంతో రాజ్ తప్పించుకుంటాడు. తర్వాత బాంబ్ స్క్వాడ్ వస్తుంది. పోలీస్ స్టే...