భారతదేశం, జనవరి 12 -- బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య ఉన్న హాస్పిటల్‌కే మంత్రి ధర్మేంద్ర తన భార్య డెలివరికి వస్తారు. డెలివరి బాగా అయ్యేలా తాము చూసుకుంటామని డాక్టర్ చక్రవర్తి చెబుతాడు. ఈసారైన అమ్మా అని పిలిపించుకుంటానా అని తులసి అంటుంది. చక్రవర్తి చెబుతున్నాడుగా. మనకు బిడ్డ పుడుతుంది. గ్రాండ్‌గా బారసాల చేస్తాం అని ధైర్యం చెబుతాడు మినిస్టర్ ధర్మేంద్ర.

మరోవైపు బెడ్ మీద కావ్య ఉండదు. డాక్టర్ షాక్ అవుతుంది. ఉదయం వరకు ఇక్కడే ఉంది. ఇంతలోనే అని నర్స్ చెబుతుంది. కావ్య మిస్సింగ్ అనేది అపర్ణ వాళ్లకు డాక్టర్ చెబుతుంది. ఎక్కడికి వెళ్లిందో అని అంతా కంగారుపడతారు. వదిన ఎక్కడికి వెళ్లిందో నాకు తెలుసు. అన్నయ్య దగ్గరికే వెళ్లి ఉంటుంది అని కల్యాణ్ తీసుకొస్తా అంటాడు.

మరోవైపు పోలీస్ స్టేషన్‌కు కావ్య వెళ్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న కావ్యను చూసి పోలీ...